IPL 2022 షెడ్యూల్ విడుదల

TATA ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 (15వ సీజన్) షెడ్యూల్‌ను BCCI ఈ రోజు ప్రకటించింది. ఈ సీజన్ మొత్తం ముంబై మరియు పూణే నగరాల్లో మాత్రమే జరుగుతుందని bcci తెలిపింది.

65 రోజుల వ్యవధిలో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు మరియు 4 ప్లేఆఫ్ మ్యాచ్ ల నిర్వహిస్తామని తెలిపారు.

15 వ సీజన్ మార్చి 26న వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ తో ప్రారంభమవుతుంది.