ఎమ్మెల్సీ పల్లాకు రుణపడి ఉంటాం – యమ్ వినోద్ కుమార్

ఈ రోజు హైదరాబాద్ లోకాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ లు TGDCLA సంఘం ఆధ్వర్యంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని కలిసి డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు అందరినీ క్రమబద్ధీకరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు యమ్. వినోద్ కుమార్ తెలిపారు.

అదే విధoగా నెల నెల వేతనాల ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా వెంటనే ఫైనాన్స్ అధికారులతో మాట్లాడి అతి త్వరలోనే ఉత్తర్వులు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పల్లారాజేశ్వర్ రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్ ల పాలిట వరమని ముఖ్యంగా డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల పాలిట దేవుడని అన్ని సమస్యలు పరిష్కారం కొరకు హమీ ఇచ్చారని TGDCLA రాష్ట్ర అధ్యక్షుల ఎం. వినోద్ కుమార్, జనరల్ సేక్రెటరీ ఖాదర్ వలి పేర్కొన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, రాష్ట్ర నాయకులు బాలరాజు, శ్రీకాంత్, బ్రహ్మం, హాబీబ్ జానీ, కవిత, నగేష్, అశోక్ కుమార్, సుధారాణి, వెంకటేశం, సువర్ణ దేవి లు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.