కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్దీకరణకై ఈటెలకు వినతి పత్రం.

కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ గురించి జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి తరపున మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని కలిసి సర్వీస్ క్రమబద్ధీకరణకు సహకరించాలని కోరామని రెమిడి మల్లారెడ్డి తెలిపారు.

అలాగే ఈ విషయాన్ని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించవలసిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగిందని మల్లారెడ్డి తెలిపారు.

ఈటెలను కలిసిన వారిలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరసింహ రాజు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, సత్తెన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.