క్రమబద్దీకరణకు సహకరించండి : భట్టి, జీవన్ రెడ్డి, చాడా వెంకట్ రెడ్డిలతో కాంట్రాక్టు అధ్యాపకులు

కాంట్రాక్టు ఉద్యోగులు,అధ్యాపకల క్రమబద్ధీకరణ గురించి జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి మరియు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి లను కలిసి క్రమబద్ధీకరణ విషయాన్ని ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళెందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించవలసిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు క్రమబద్దీకరణకు పూర్తి సహకారం అందిస్తామని హమీ ఇచ్చారని కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ సత్య, జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ తరఫున శ్రీనివాస్ రెడ్డి, సంగీత, మల్లన్న జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ మల్లారెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.