రేవంత్ రెడ్డిని కలిసిన కాంట్రాక్టు ఉద్యోగులు

కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు ఈ రోజు సర్వీస్ క్రమబద్ధీకరణ గురించి జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించవలసిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.

వచ్చే బడ్జెట్ సమావేశాలలో కాంట్రాక్టు ఉద్యోగుల, అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయాన్ని ప్రభుత్వము దృష్టికి వచ్చేలా శాసనసభ లో ప్రస్తావించాలని కొరడం జరిగిందని రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి సత్య, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ నుంచి ఉదయ భాస్కర్, డిగ్రీ కాంట్రాక్ట లెక్చరర్స్ తరఫున ఉదయశ్రీ, జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ తరఫున శ్రీనివాస్ రెడ్డి, సంగీత, శోభన్, మనోహర్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.