ఎమ్మెల్సీ అలుగుబెల్లితో కాంట్రాక్టు ఉద్యోగుల భేటీ

కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకలు సర్వీస్ క్రమబద్ధీకరణ గురించి జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ శ్ర అలుగుబెల్లి నర్సిరెడ్డిని కలిసి క్రమబద్ధీకరణ విషయాన్ని శాసనమండలిలో మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వము దృష్టికి తెలియజేయాలని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహకరించవలసిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ సత్య, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ నుంచి ఉదయ భాస్కర్, డిగ్రీ కాంట్రాక్ట లెక్చరర్స్ తరఫున ఉదయశ్రీ, జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ తరఫున వస్కుల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సంగీత, శోభన్, మనోహర్, మల్లన్న పాల్గొన్నారు.