బండి సంజయ్ ని కలిసిన కాంట్రాక్టు ఉద్యోగులు

కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకలు సర్వీస్ క్రమబద్ధీకరణ గురించి జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి క్రమబద్ధీకరణ విషయంలో సహకరించాలని, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహకరించవలసిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్ సత్య, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ నుంచి ఉదయ భాస్కర్, డిగ్రీ కాంట్రాక్ట లెక్చరర్స్ తరఫున ఉదయశ్రీ, జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ తరఫున వస్కుల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సంగీత, శోభన్, మనోహర్, మల్లన్న పాల్గొన్నారు.