2022-23 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ (బీటెక్ మొదటి సంవత్సరం) విద్యార్థులకు అక్టోబరు 10వ తేదీ నుంచి ఓరియంటేషన్ ప్రారంభించనున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏఐసీటీఈ విద్యా క్యాలెండరు ఇటీవల సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
విద్యా క్యాలెండర్ ఇలా..
• జులై 10 నాటికి కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇస్తుంది. అప్పీలకు వెళితే వాటిని అదే నెల 30వ తేదీ నాటికి పరిష్కరిస్తుంది.
• ఆగస్టు 31 నాటికి ఆయా విశ్వవిద్యాలయాలు కళా శాలలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వాలి.
• సెప్టెంబరు 15 నాటికి పాత విద్యార్థులకు తరగతుల ప్రారంభం
• అక్టోబరు 10 లోపు తొలి ఏడాది విద్యార్ధులకు ఓరియంటేషన్ ప్రారంభించాలి.
• అక్టోబరు 25 లోపు తరగతుల ప్రారంభం