మంత్రి హరీష్ రావుని కలిసిన కాంట్రాక్టు అధ్యాపకులు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు విచ్చేసిన ఆర్థిక శాఖ మరియు ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావుని మధుసూదన్ రెడ్డి, సీహెచ్ కనకచంద్రం సూచన మేరకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా 711 సంఘం ఆధ్వర్యంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల బదిలీలు మరియు క్రమబద్ధీకరణ చేయమని వినతి పత్రం ఇవ్వడము జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని మోతిలాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లు కలిసిన వారిలో దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి‌ సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు ఎమ్మెల్సీ దండే విఠల్ లు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో 711 సంఘం జిల్లా అధ్యక్షులు బి.హెచ్. మోతిలాల్ నాయక్‌, ఉపాధ్యక్షులు కె. సంతోష్ కుమార్, కోశాధికారి రామారావు, సెక్రటరీ శ్రీనివాస్ నాయక్, మహిళా అధ్యక్షురాలు రజిత, ఆనంద్, అశోక్, రవి, తదితరులు పాల్గోన్నారు.