బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB) 105 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB) 105 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్‌ క్రెడిట్‌ డిపార్టుమెంట్లలో ఈ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి.

ఇందులో డిజిటల్‌ ఫ్రాడ్‌ మేనేజర్‌ 15, క్రెడిట్‌ ఆఫీసర్‌ (ఎంఎస్‌ఎంఈ) 40, క్రెడిట్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌ 20, ఫారెక్స్‌ అక్విసిషన్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు :- ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. బీఈ, బీటెక్‌, ఎంసీఏ, సీఏ, సీఎంఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

వయోపరిమితి :- అభ్యర్థులు 24 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :- రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు :– రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100

దరఖాస్తులు ప్రారంభం :- మార్చి – 4 – 2022 నుండి

దరఖాస్తులకు చివరితేదీ :- మార్చి – 24 – 2022 వరకు

◆ వెబ్సైట్‌ :- www.bankofbaroda.co.in