డిచ్పల్లి జూనియర్ కళాశాల లో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్పల్లి లో జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రభుత్వ కళాశాల నుండి రైల్వేస్టేషన్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం లో జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ మనోహర్ ఎయిడ్స్ వ్యాధిని గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణ అవసరమైన సూచనలు, సలహాలు, వ్యాధి లక్షణాలను గురించి నివారణ మార్గాలను గురించి సామాజిక అవగాహనను విద్యార్థులకు అందించడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధికి సంపూర్ణమైన చికిత్స లేదు. కేవలం కొంత తీవ్రత ను తగ్గించడానికి మాత్రమే మందులు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ చంద్ర విఠల్ మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఎయిడ్స్ గురించి అవగాహన చేసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మీతో పాటు మీ చుట్టూ ఉన్న బంధువులకు మిత్రులకు మీ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సి నరసింహ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, శ్రీమతి విజయ, నారాయణ, పని కుమార్, అర్చన, మురళి, తిరుపతి, ప్రవీణ్ కుమార్, సుజాత, శ్రీలక్ష్మి, స్రవంతి,నీతా, సదానంద్, లిఖిత, సందీప్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.