డా. రెడ్డిస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో మార్చి 6న సంగారెడ్డిలో మెగా జాబ్ మేళా

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని SV జూనియర్ కళాశాల
యందు మార్చి 6వ తేదీన డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరిస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించుచున్నారు.

• అర్హతలు :- 2020 – 2021 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

తెలుగు భాష పై పట్టు ఉండి, ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.

• వయోపరిమితి :- 18 – 20 ఏళ్ల మద్య వయస్సు ఉండాలి

• ఎంపిక విధానం : వ్రాత పరీక్ష ఆధారంగా

• అవకాశాలు :- డా. రెడ్డీస్ లాబోరేటరీస్ వారు బిట్స్ పిలాని హైదరాబాద్ యందు డిగ్రీ చదివిస్తూ (ఫార్మషుటికల్ కెమిస్ట్రి), ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని, తగిన వేతనం కూడ ఇస్తుందని పేర్కొన్నారు.

• సర్టిఫికెట్స్ :- పదవ తరగతి, ఇంటర్మీడియట్ మెమోలతో పాటు ఆధార్ కార్డు వంటి పత్రాలతో మరియు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలకు లోబడి హాజరు కావాలని సూచించారు.

వివరాలకు
9849477450
9290434597
9440362346

మొబైల్ నెంబర్సు యందు సంప్రదించాలని పేర్కొన్నారు.