ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ మారే అవకాశం.

ఏప్రిల్ లో జరిగే తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ఒకే తేదీల్లో జేఈఈ మెయిన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడంతో షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎసీఏ)జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంట్లో ఏప్రిల్ 16 నుంచి 21 వరకు ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. దీంతో ఏప్రిల్ 20న ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ – 1. 21న సెకండ్ లాంగ్వేజీ పేపర్-2 పరీక్షలున్నాయి. దీంతో ఈ 2 పరీక్షల షెడ్యూల్ మార్పు జరగే అవకాశం ఉంది.