వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియమే

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ముందుగా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమం బోధించనున్నారు. ఒకే పుస్తకంలో తెలుగు, ఇంగ్లీష్ పాఠాలు ఉండనున్నాయి.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ.. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపైనా చర్చించింది.