ఎమ్మెల్సీ లను కలిసిన టీజీవో నాయకులు

వరంగల్ : టీజీవో ఇంటర్ విద్యా రాష్ట్ర నాయకులు అస్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి మరియు బండ ప్రకాష్ లను 475 జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి, వీలయినంత త్వరగా క్రమబద్ధీకరణ జరిగేటట్లు చూడవలసిందిగా కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జీఓ నెంబర్ 16, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి ,కో _కన్వీనర్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, 475 సంఘ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు బి.ప్రవీణ్, వరంగల్ ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొన్నారు.