కొడిమ్యాల కళాశాలలో సైన్స్ డే వేడుకలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల యందు సి.వి.రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్సు దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ ఎం. సంజీవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంజీవ్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. నిత్య జీవితంలో సైన్స్ ముఖ్యమని, మన అభివృద్ధి అంతా సైన్స్ వలననే అని… విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలని, నూతన ఆవిష్కరణలకు దారి తీసే వైజ్ఞానిక ఆలోచనలను పెంచుకోవాలని సూచించారు.

భౌతిక శాస్త్రం అధ్యాపకుడు నరసయ్య మాట్లాడుతూ సైన్స్ మానవున్ని విశ్వాంతరాళకు తీసుకెళ్లిందని గుర్తుచేస్తూ… సైన్స్ లో సి.వి.రామన్ చేసిన ఆవిష్కరణలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజీవ్, అధ్యాపకులు ఇందూర, నర్సయ్య, సుమన్, ప్రభాకర్ , జయపాల్ రెడ్డి, భాస్కర్, బాలకృష్ణారెడ్డి, తిరుపతి, జయశీల , అనిల్ కుమార్, ప్రవీణ్, బాలాజీ సింగ్, ఆఫీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.