మధుసూదన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌటాలలో ఈ రోజు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మరియు బదిలీ సాధన సమితి గౌరవ అధ్యక్షులు “డా. మధుసూదన్ రెడ్డి” జన్మదిన దినోత్సము పురస్కరించుకొని కళాశాల విద్యార్థిని విద్యార్దులకు కుమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా 711 కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ మరియు బదిలీ సాధన సమితి ఆధ్వర్యంలో పండ్ల పంపిణి కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో 711అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి హెచ్. మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ ఇంటర్ విద్యా వ్యవస్థ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి డా. మధుసూదన్ రెడ్డి ఎంతగానో కృషి చేసారని తెలిపారు. అలాగే శకాంట్రాక్టు లెక్చరర్ ల క్రమబద్దికరణ మరియు బదిలీల అంశంలో మధుసూదన్ రెడ్డి కృషి చేస్తున్నారని మోతిలాల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 711అసోసియేషన్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, సెక్రటరీ శ్రీనివాస్ నాయక్. జిల్లా మహిళా కార్యదర్శి రజిత, వైస్ ప్రెసిడెంట్ కె.సంతోష్ కుమార్, కోశాధికారి రామారావు మరియు అధ్యాపకులు ఆంజినేయులు, రవీందర్, రాందాస్, తస్లీమున్నిసా బేగం, కిషోర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గోన్నారు.