- మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (బాలికల) – గన్ పౌండ్రీ విద్యార్థిని ఘనత.
- అభినందించిన ప్రిన్సిపాల్ & సిబ్బంది
ఉజ్బెకిస్థాన్ లో జరుగుతున్న ఆసియన్ కాడెట్ పెన్సింగ్ గేమ్స్ లో మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (బాలికల) – గన్ పౌండ్రీ హైదరాబాద్ లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ నజియా సిల్వర్ మెడల్ సాదించిందని కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సిల్వర్ మెడల్ సాదించిన షేక్ నజియా తమ కళాశాల విద్యార్థి కావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే షేక్ నజియాను ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందించారు. నజియా తండ్రి ఆటో డ్రైవర్ కావాడం గమనార్హం.