ఆర్మీ పబ్లిక్ స్కూల్ – గోల్కొండలో 30 టీచింగ్ ఉద్యోగాలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ – గోల్కొండ(హైదరాబాద్) 30 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

★ పోస్టుల వారీగా ఖాళీలు :

  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్( పీజీటీ) – 05
  • ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్( టీజీటీ)-11,
  • ప్రైమరీ “టీచర్( పీఆర్టీ)-10, * ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్(పీఈటీ)-02
  • స్పెషల్ ఎడ్యుకేటర్;
  • కౌన్సెలర్ (ఫుల్ టైమ్).

★ విభాగాలు : పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్,
సైన్స్ తదితరాలు.

★ అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డీఈడీ/బీఈడీ ఉత్తీర్ణత. ఏడబ్ల్యూఈఎస్ స్క్రీనింగ్ పరీక్ష ఉత్తీర్ణతతోపాటు సీటెట్/టెట్ ఆర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

★ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : రూ.1000 చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 14

★ చిరునామా : ద ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదర్ షా కోట, నియర్ సన్ సిటీ, హైదరాబాద్-500031

★ వెబ్సైట్ : www.apsgolconda.edu.in/