ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

జగిత్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కళాశాల ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సంజీవ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విధిగా ఇంటి పరిసరాలతో పాటు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అందరు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. పి.తిరుపతి, అధ్యాపకులు ఇందుర, బాలకృష్ణ రెడ్డి, నరసయ్య జైపాల్ రెడ్డి, ప్రభాకర్, సుమన్, భాస్కర్, జయశీల, అనిల్ కుమార్, బాలాజీ, ప్రవీణ్ మరియు ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు.