ప్రసాద్ పథకంలోకి రామప్ప దేవాలయం

కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీక, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ “తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం” (ప్రసాద్) లో చేర్చింది. భద్రాచలం ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చిన విషయం తెలిసిందే. రామాయణ సర్క్యూట్ కింద ఆ ఆలయాన్ని చేర్చారు.

ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు సంబంధించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపాలని కేంద్ర పర్యాటకశాఖ రాష్ట్రాన్ని కోరనుంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ములుగు జిల్లాలోని రామప్ప (రుద్రేశ్వర) ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.