మార్చి 27న నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష

నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న 8వ తరగతి విద్యార్థులకు మార్చి 27వ తేదీన ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల విద్యాధికారులు (డీఈవోలు) చర్యలు తీసుకోవాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పారు.

ఇందుకు సంబంధించిన వివరాలను http//bse.telangana.gov.in వెబ్సైట్లో విద్యార్థులు చూసుకోవచ్చని ఆయన తెలిపారు.