ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు తరలి రావాలి – హేమచందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా : ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 28వ తేదీన హైదరాబాదులో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పుట్టినరోజు వేడుకలలో పాల్గొనే నిమిత్తం ఈరోజు TGCCLA-711 సూర్యాపేట జిల్లా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూర్ నగర్ నందు జరిగిన సన్నాహక సమావేశం జరిగింది.

ఇంటర్ విద్యా జేఏసీ కో చైర్మన్ మరియు కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ చైర్మన్ కనకచంద్రం ఆహ్వానం మేరకు సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపక మిత్రులు అధిక సంఖ్యలో ఈ వేడుకలకు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లుజిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.