గెస్ట్ లెక్చరర్ ల సమస్యలు కమీషనర్ దృష్టికి

ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియేట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆకస్మిక పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ (బాలుర)కళాశాలను సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అతిధి అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఎండీ సజ్జాద్ అలీ కమిషనర్ తో వారి సమస్యల పై వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించారని సజ్జాద్ అలీ తెలిపారు.

                                 గెస్ట్ జూనియర్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలకు సంబంధించి బడ్జెట్ విడుదల అయ్యిందని, ఈ విద్యా సంవత్సరం చివరి వరకు (ఏప్రిల్, 14) వరకు కొనసిగిస్తున్నట్లు తెలియజేశారని,       వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచే కొనసాగిస్తామని, ప్రభుత్వంతో మాట్లాడి కన్సాలిడేటెడ్ పేమెంట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని కమీషన్ ఉమర్ జలీల్ చెప్పారని సజ్జాద్ అలీ తెలిపారు.

317 GO మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ రాక తొలగించబడిన గెస్ట్ అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విన్నపంపై సానుకూలంగా స్పందించి గెస్ట్ ఫ్యాకల్టీ విధుల పట్ల హర్షం వ్యక్తం చేశారని సజ్జాద్ అలీ తెలిపారు.