మార్చి 6న టీజీయూజీ సెట్ : 2022 ప్రవేశ పరీక్ష

తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 (TGUG CET )ను మార్చి 6న నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ సెక్రటరీ రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ బాలబాలికల డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 26 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు 70 సెంటర్లలో ఏర్పాట్లు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.