రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ లో 8వ తరగతి ప్రవేశాలు – TSPSC

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC)లో 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టీఎస్ పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. జనవరి 2023 టర్మ్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు 2010 జనవరి 2 నుంచి 2011 జూలై 1లోపు జన్మించి ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని సూచించారు.

దరఖాస్తులు నేరుగా RIMC నుంచి పొందవచ్చని, పూర్తిచేసిన దరఖాస్తులను ఏప్రిల్ 25 లోగా TSPSC కార్యాలయంలో అందజేయాలని వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.tspsc.gov.in