బీసీ స్టడీ సర్కిల్ లో అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైదరాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.

పోటీ పరీక్షలకు అంశాల వారీగా శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులైన అభ్యర్థులు బయోడేటాను tsbcstudycircle@gmail.com కు పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు 63024 27521 నంబర్ లో సంప్రదించాలని కోరారు.