సూర్యాపేట DIEO గారిని సన్మానించిన TGCCLA- 711 సూర్యాపేట జిల్లా సంఘం

సూర్యాపేట : కళాశాలల తనిఖీల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూర్ నగర్ ను సందర్శించిన సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ జానపాటి కృష్ణయ్య ను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ VDS ప్రసాద్, అధ్యాపకురాలు శ్రీమతి అరుణ, TGCCLA-711 జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి, కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా కొనసాగుతున్న వారిపై TDS పేరిట వేతనంలో 10% కోత విధిస్తున్న నేపథ్యంలో ముందుగా స్పందించి ఆదాయపన్ను శాఖ అధికారులకు కాంట్రాక్టు అధ్యాపకులు 194J పరిధిలోకి రారని అలాగే ఇంటర్మీడియట్ విద్యాధికారులకు పెనాల్టీ విధిస్తూ నోటీసు ఇవ్వడం పై అప్పిల్ కు వెళ్ళడంతో అనుకూలంగా స్పందించిన ఫలితంగా ఐటీ శాఖ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాల్లో టీడీఎస్ రూపంలో కోత పడకుండా ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 711 జిల్లా అధ్యక్షుడు హేమ చందర్ రెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ జానపాటి కృష్ణయ్య కు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ నాగరాజు, అధ్యాపకులు నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మచారి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు బుస్సా మహేష్, రామ్మూర్తి, వీరన్న, నాగుల్ మీరా, రమేష్, రమణారెడ్డి, శ్రీమతి ఉపేంద్ర, గెస్ట్ అధ్యాపకులు రాములు, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.