విదేశాల్లో పీజీ, పీహెచ్డీకి స్కాలర్ షిప్

విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్డీ చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు నేషనల్ ఓవర్ సీస్ స్కాలర్షిప్ పధకం కింద 2022-23 విద్యాసంవత్సరంలో స్కాలర్ షిప్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హులైన అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు విదేశీ వర్సిటీలో చేరాక ఏటా నిర్వహణ వ్యయం, కోర్సు ఫీజు, వీసా, విమాన ప్రయాణ ఖర్చులకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది. అభ్యర్థులు www.nosmsje.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.