డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్, ట్విటర్‌కు పోటీగా ట్రంప్ “ట్రూత్ సోషల్” అనే సోషల్ మీడియా యాప్ ను సొంతంగా ఎర్పర్చుకున్నాడు.ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో లభ్యమవుతుంది.
గతేడాది డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల లో ఓటమి తర్వాత క్యాపిటల్ భవనం పైకి తన మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు కారణమవ్వడంతో ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి.
దీనికి సంబం ధించి బీటా వెర్షన్ టెస్టింగ్ కూడా పూర్తయ్యింది. ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్ లోనూ ఒకరినొకరు అనుసరించొచ్చు. ట్రెండింగ్ లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. ట్విటర్ లో పోస్ట్ చేసేవాటిని ట్వీట్ అంటాం. ట్రూత్ సోషల్ మీడియా యాప్ లో మాత్రం ‘ట్రూత్’ అని సంబోధిస్తారు.