గెస్ట్ లెక్చరర్ ల రెన్యూవల్ గడువు పొడిగించాలని మంత్రి సబితాకు వినతి : దామెర, దార్ల

గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ ను పొడిగించాలని, డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్లను రీ అలాట్ చేయాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయించాలని విద్యాశాఖ మంత్రి కి ఈ రోజు 2152 గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ గెస్ట్ లెక్చరర్స్ రెన్యూవల్ ను పొడిగించాలని, అందుకు సంబందించిన ప్రతిపాదనలను ఈరోజే పంపాలని, అలాగే డిస్ట్రబ్డ్ గెస్ట్ లెక్చరర్ లకు త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమీషనర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారని దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సంధర్భంగా సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించిన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డికి 2152 సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని సంఘ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కవిత, రీనా, నవమణి, యుగేందర్, కృష్ణ, నవాజ్, సురేందర్, బాలరాజు తదతరులు పాల్గొన్నారు.