ముఖ్యమంత్రి ఆదేశాలైన బదిలీలు జరిపించాలని వినతి పత్రాలు ప్రదర్శన

15కు పైగా సంవత్సరాల నుండి బదిలీలు లేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు బదిలీ సాదన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఆవరణలో సీఎం కేసీఆర్ బదిలీలపై ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఉదయం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని వారి స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన తమ గోడును వెళ్లబోసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్ కార్యాలయంలో పలువురు అధికారులకు వినతిపత్రాలు సమర్పించి.. వినతి పత్రాలతో కమీషనరేట్ ఆవరణలో నిరసన తెలియజేశారు

అలాగే ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి గౌరవప్రదంగా కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అలాగే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కనక చంద్రం తమకు బాసటగా నిలవాలని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించారని బదిలీ సాధన సమితి కన్వీనర్ నరసింహ, నూనె శ్రీనివాస్, మోతిలాల్ నాయక్, రాముడు, ప్రవీణ్ తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు.