వేతనాలు విడుదల పట్ల 475 సంఘం హర్షం

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలను విడుదల చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నెలనెలా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.