మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన బదిలీ బాధితుల సమితి సభ్యులు

బదిలీ బాధితుల సమితి ఆధ్వర్యంలో ఈ రోజు బదిలీల సాదనకై ఈ రోజు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి సీఎం ఆదేశాల ప్రకారం వెంటనే బదిలీలు చేపట్టాలని కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు వినతిపత్రం సమర్పించారు.

గత 14 సంవత్సరాలుగా బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటూ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న తమకు బదిలీలు జరపాలని నవంబర్ 14 తేదీన దీపావళి కానుకగా సీఎం కేసీఆర్ బదిలీలకు అనుమతించారని. కానీ ఇప్పటివరకు బదిలీలపై ఏలాంటి చర్యలు తీసుకోలేదని విన్నవించారు.

ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రెగ్యులర్ అధ్యాపకులకు బదిలీలు జరుగి వీరివలన కొందరు కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు డిస్టర్బ్ కావడం జరిగిందని.. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చింనందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అదేవిధంగా గత 14 సంవత్సరాలుగా బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎన్నో బాధలను అనుభవిస్తున్నామని.

కావునా నూతన జోనల్ విధానం ప్రకారం స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టి మా జీవితాల్లో వెలుగులు నింపాలని ఎన్నో వేల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు

ఇప్పుడు బదిలీలు జరగకపోతే భవిష్యత్తులో మా పిల్లలు స్థానికత కోల్పోవలసి వస్తుందని దానివలన మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని వాపోయారు.