ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్

ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం నుంచి 26 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్

www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.