మ్యూచువల్ బదిలీలతో సర్వీస్ కోల్పోరు.

మ్యుచువల్ బదిలీలు పొందిన ఇద్దరు ఉద్యోగుల ఒకే జిల్లా కేడర్ కు చెంది ఉంటే ఎలాంటి సర్వీస్ ను కోల్పోరని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 ప్రకారం నూతన జోనల్ విధానం ప్రకారం స్థానికత కల్పించుటకు జారీ చేసిన జీవో 317 ప్రకారం ఉపాధ్యాయులందరికి సరైన న్యాయం జరగలేదని భావించిన ప్రభుత్వం మ్యుచువల్ బదిలీలకు జీవో 21 తో అనుమతించింది. అయితే ఈ జీవో ప్రకారం మ్యుచువల్ బదిలీ పొందిన వారు తమ సర్వీస్ ను కోల్పోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా జీవో 402 ను విడుదల చేయడం జరిగింది.