జాతీయ బీసీ సంక్షేమ సంఘము జిల్లా క్యాలెండర్స్ ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా : ఈరోజు గాంధారి మండల కేంద్రంలో గాంధారి మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండి రాజులు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా శాఖ జాతీయ బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘము మండలం అధ్యక్షులు బండి రాజు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షలు ఆర్. కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేస్తున్నాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం జడ్పిటిసి శంకర్ నాయక్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామ్మయి సంజీవ్ యాదవ్, ఎంపీడీవో మనేటి సతీష్ ,మాజీ జెడ్పిటిసి తానాజీ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం మండలం ఉపాధ్యక్షుడు శంకర్రావు , ప్రధాన కార్యదర్శి నస్కంటి రవి, యూత్ అధ్యక్షుడు సిందే నితిన్, యూత్ ప్రధాన కార్యదర్శి పనుకంటి నవీన్,ఉప్పు నందు,ధనుంజయ్,పరమేష్, తాటిపాముల సత్యం, కొమ్ముల ఆంజనేయులు, కొమ్ముల సంజీవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.