డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్లను వెంటనే రీ అలాట్ చేయాలి

  • రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఖాళీల జాబితా విడుదల చేయాలి
  • గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ ను చివరి పనిదినం వరకు పొడిగించాలి
  • గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్

హైద్రాబాద్: 317 జీవో కారణంగా రెగ్యూలర్ లెక్చరర్ల అలాట్ మెంట్ తో మరియు కాంట్రాక్ట్ లెక్చరర్ల రీ అలాట్ మెంట్ కారణంగా డిస్టర్బ్ అయిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు అందుబాటులో ఉన్న మరొక కళాశాలల్లో ఉన్న ఖాళీలలో రీ అలాట్ మెంట్ చేయాలని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు.

ఈ విద్యాసంవత్సరంలో జూన్ నుండి రెన్యూవల్ చేయకపోవడంతో 4 నెలలు ఉపాధి కోల్పోవడమే కాకుండా ఇప్పటికీ బడ్జెట్ విడుదల కాకపోవడంతో 5 నెలలుగా ఎలాంటి వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలను విడుదల చేయడమే గాక 317 జీవో కారణంగా డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్లకు సత్వరమే మరొక చోట రీ అలాట్ చేయాలని కోరారు.

అలాగే ప్రస్తుతం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షల టైం టేబుల్ పొడిగించడంతో తరగతుల నిర్వహణ, సిలబస్ పూర్తి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరం చివరిపని దినం వరకు గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ ను పొడిగించాలని ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డు ను వేడుకుంటున్నట్లు గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు ఒక ప్రకటనలో తెలిపారు.