ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NCC యూనిట్ ల ఏర్పాటుకు చర్యలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NCC యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కళాశాల ప్రిన్సిపాల్ లకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సూచన చేసింది.

విద్యార్థుల్లో సేవా దృక్పథం పెంచే NCC యూనిట్ లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడానికి కళాశాల ప్రిన్సిపాల్ లు పూర్తి వివరాలతో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారికి 10 రోజులలో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది.