సివిల్స్ పరీక్షల ద్వారా IRMS లో 150 పోస్టుల భర్తీ

ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ (IRMS)లో 150 గ్రూప్ ఏ అధికారులను నియమిస్తామని కేంద్రం గురువారం ప్రకటించింది.

ఈ 150 మందిని సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపింది. సివిల్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న అర్హతలే ఈ పోస్టులకు కూడా వర్తిస్తాయని, ఇప్పటికే సివిల్స్ కు దరఖాస్తు చేసుకొన్నవారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.