ఏపీ స్థానికత గల ఉపాధ్యాయులను బదిలీ చేయాలి – ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత కల్గిన 578 మంది ఉపాద్యాయులను ఏపీ కి అంతరాష్ట్ర బదిలీలు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి లేఖ రాశారు.

లేఖలో జిల్లా క్యాడర్‌కు చెందిన ఉపాధ్యాయులు సుమారుగా 578 మంది తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర బదిలీలపై వెళ్ళటానికి అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్స్ పెట్టుకున్న వారినందరినీ వారి స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు పంపించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 578 ఖాళీలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

అలాగే పై విధంగా ఏర్పడ్డ ఖాళీలలో 317 జి.ఓ. ప్రకారం స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను తిరిగి వారి స్వంత జిల్లాలకు తీసుకువచ్చి సర్దుబాటు చేస్తే నష్టపోయిన ఉపాధ్యాయులకు కొంతమేరకు లాభం చేకూరుతుందని లేఖలో కూర రఘోత్తం రెడ్డి పేర్కొన్నారు.