సింగరేణి కి గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు

సింగరేణి సేవలకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్(ఈఈఎఫ్) తెలంగాణ సింగరేణి సేవలకు గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు అందజేసింది.

గురువారం వర్చువల్ పద్ధతిలో 12వ అంతర్జాతీయ పెట్రో-కోల్ సదస్సు, ప్రదర్శన – 2022 కార్యక్రమం జరిగింది. ఈ వేడు మకలో సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పీ అండ్ సీ) ఎన్ బలరామ్ అవార్డును ఆన్లైన్లో స్వీకరించారు.