జాతీయ బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లా : సదాశివనగర్ మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీడీవో రాజ్ వీర్, ఎంపీపీ గైని అనసూయ చేతుల మీదిగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సబ్బని లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటాలు అద్వితీయమని బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు కోసం పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ మెంబెర్ ఎండి మొయినుద్దీన్, బి.సి. సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు రాజీవ్ కుమార్, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షులు అఖిల్ రావు, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.