బదిలీలకై ఫిబ్రవరి – 21 న హైదరాబాద్ కు బదిలీ బాధితులు

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల బదిలీల సాధన కొరకు భారీ ఎత్తున బదిలీ బాధితులు ఫిబ్రవరి – 21 న హైదరాబాదుకు తరలి రావాలని బదిలీ సాధన సమితి పిలుపునిచ్చింది.

ఫిబ్రవరి 21 ఇంటర్మీడియట్ కార్యాలయానికి భారీ ఎత్తున బదిలీ కోరుకునే బాధితులు చేరుకోని అధికారులు, మంత్రులు‌, ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు.

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లకు బదిలీ జరపాలని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన 15 నెలలు గడిచిన అధికారులు బదిలీల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బదిలీ సాధన సమితి ప్రభుత్వంలోని మంత్రులు, ఇంటర్మీడియట్ అధికారులను కలిసి భారీ ఎత్తున వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కన్వీనర్ సీ. నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శులు మోతీలాల్ నాయక్, రాముడు, శ్రీనాద్, ముఖ్య సమన్వయ కర్త నూనె శ్రీనివాస్, మహిళా కార్యదర్శులు సుజాత, మంజుల, ఉపాధ్యక్షులు సైదులు గౌడ్, ప్రవీణ్ కుమార్, రవీందర్, సంజీవయ్య, కార్యదర్శులు కృష్ణ, రమేష్‌, విప్లవ రెడ్డి, పాపారావులు ఒక ప్రకటనలో తెలిపారు.