సీజేఎల్స్ రీఎంగేజ్మెంట్ పట్ల హర్షం – TIGLA, 475 సంఘం

317 జిఓ అమలు ద్వారా డిస్టృబ్ కాబడిన కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు ఈరోజు తిరిగి అలాట్మెంట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జంగయ్య, రామకృష్ణ గౌడ్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

ఉ సందర్భంగా ఇంటర్ విద్య కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ కి మరియు ఖాలిక్ లకు TIGLA రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు, 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హరగోపాల్ పాల్గొన్నారు.