సీజేఎల్స్ రీఎంగేజ్మెంట్ పట్ల హర్షం – 711 సంఘం

రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం 317జీవో అమలులో భాగంగా డిస్ట్రబ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఈ రోజు విధులలో చేరేందుకు ఉత్తర్వులు వెలువడే విదంగా సీహెచ్ కనకచంద్రం ఆధ్వర్యంలో అహర్నిశలు కృషి చేసిందని 711 సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు

ఈరోజు ఇంటర్ విద్య కమీషనర్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు రీఎంగేజ్మెంట్ ఆర్డర్ లు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా నరసింహ హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షురాలు మాలతి ఓ ఎస్ డి ఖాలిక్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ ఉమర్ జలీల్ కు, ఓఎస్డీ ఖాలీక్ కు, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డికి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రంకు ధన్యవాదాలు తెలిపారు.