గెస్ట్ లెక్చర్ల పై 18% జీఎస్టీ

గెస్ట్ లెక్చర్ల ద్వారా సంపాదించిన ఆదాయంపై జీఎస్టీ కింద 18 శాతం పన్ను వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) కర్ణాటక బెంచ్ తీర్పు చెప్పింది.

లెక్చర్ల ఆదాయం సర్వీసు పన్ను పరిధిలోకి వస్తుందా లేదా అన్నది స్పష్టం చేయాలని సాయిరాం గోపాలకృష్ణ భట్ అనే వ్యక్తి బెంచ్ ముందు పిటిషన్ వేశారు. గెస్ట్ లెక్చర్లు మినహాయింపు జాబితాలో లేవని, వృత్తిపరమైన, సాంకేతిక, వాణిజ్యపరమైన, ఇతర సేవల కిందకు వస్తుందని బెంచ్ పేర్కొన్నది. ఫలితంగా సదరు ఆదాయంపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.