కేసీఆర్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ చేసిన కనకచంద్రం

సిద్ధిపేట : తెలంగాణ స్వాతంత్ర్య యోధుడు కాంట్రాక్ట్ లెక్చరర్ల కరుణామయుడు తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కనక చంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సిద్దిపేటలో విద్యార్థిని విద్యార్థులకు పండ్ల పంపకం జరిగింది. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్ల రాష్ట్ర నాయకులు అశోక్, డిగ్రీ కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రద్దానందం, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్, జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటరమణ, జిల్లా అధికార ప్రతినిధి రఘురాజు, యాదగిరి, ప్రసాద్, రేవంత్, శ్రీనివాస్ మహేష్ , వెంకటేష్, మంగత నాయక్ తదితరులు పాల్గొన్నారు.