వెంటనే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు బదిలీలు జరిపించాలి – బదిలీ సాధన సమితి

317 జీవో అమలు కారణంగా డిస్ట్రబ్ అయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు రీఎంగేజ్మెంట్ ఉత్తర్వులు వెలువరించిన ఇంటర్మీడియట్ కమిషనర్ కు బదిలీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నరసింహారెడ్డి, నూనె శ్రీనివాస్, మోతిలాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే సీజేఎల్స్ బదిలీ లపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు వెంటనే బదిలీలకై ఉత్తర్వులు వెలువరించి బదిలీలు జరిపించాలని ఈ సందర్భంగా కమిషనర్ కు మరియు ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నట్లు ఒక ప్రకటనలో బదిలీ సాధన సమితి నాయకులు తెలిపారు.