జూనియర్ కళాశాలలకు …. మన ఊరు-మన బడి అమలు

  • రాష్ట్ర వ్యాప్తంగా 42 జూనియర్ కాలేజీలను గుర్తించిన ఇంటర్ బోర్డు
  • మౌలిక వసతులు, బడ్జెట్ తదితర అంశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు!
  • అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనా వసతులను కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.7,289 కోట్లతో చేపట్టిన మన ఊరు-మన బడి, మన ఊరు-మన బస్తీ పథకంలో ఇంటర్ కాలేజీలను కూడా చేర్చారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లోని ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మన ఊరు-మన బడి పథకంలో భాగంగా ముందస్తుగా పాఠశాలల్లో మాత్రమే మౌలిక వసతులు మెరుగుపర్చాలని ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో పాఠశాలల ఆవరణలోని జూనియర్ కాలేజీల్లోనూ వసతులు మెరుగుపర్చాలనే డిమాండ్ రావడంతో ప్రభుత్వం దీనికి అంగీకరించింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 405 ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కాలేజీలు ప్రభుత్వ పాఠశాలల్లోనే గత కొంతకాలంగా నడుస్తుండడంతో స్కూళ్లతో పాటు వీటిని కూడా మన ఊరు-మన బడి పథకంలో భాగం చేయనున్నారు. ఈ తరహాలో రాష్ట్రంలో ఎన్ని జూనియర్ కాలేజీలు ఈ పథకంలో భాగం కానున్నాయనే దానిపై ఉన్నతాధికారులు ఇంటర్ బోర్డు అధికారులకు నివేదిక అడిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మొత్తం 42 కాలేజీలను గుర్తించినట్లు బోర్డు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది.

పాఠశాలల్లో 12 అంశాలైన నీటి సౌకర్యంతో టాయిలెట్లు, విద్యుత్, మం చినీటి సరఫరా, ఫర్నీచర్, పెయింటింగ్, చిన్న పెద్ద రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్స్, కొత్త తరగతి గదులు, డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్యా కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. అయితే కాలేజీల్లోనూ ఈ 12 అంశాల్లో ఏం అవసరం? ఏం ఉన్నాయి? ఏం లెవ్వు? ఎంత బడ్జెట్ కావాలి? అనే అంశాలపై కాలె ‘జీల వారీగా ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం మంత్రుల కమిటీ దీనిపై చర్చించి అనుమతులు జారీ చేయనుంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే స్కూ ళ్లలో చేపట్టే 12 అంశాల్లో కొన్నింటిని మినహాయించి మిగతా వాటిని కాలేజీలకు అమలు చేయనున్నట్లు సమాచారం. కళాశాలల్లో లేని వసతులను కల్పించ నున్నారు. ఇదిలా ఉంటే మొదటి దశలో భాగంగా రూ.3,497.62 కోట్లతో 9,123 పాఠశాలల్లో కనీస వసతులను కల్పించనున్నారు.

Credits/Courtesy: andhra prabha